హద్దులు లేని అభిమానం

అనపర్తి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశలో తన వంతు బాధ్యతగా ప్రస్తుతం న్యూజిలాండ్ లో నివాసం ఉంటున్న అనపర్తి నియోజకవర్గం సంపర గ్రామం చెందిన కొండేపూడి బాబురావు కుమారుడు కొండేపూడి అచ్చియ్య (ఎన్నారై) 9,999/- రూపాయలు జనసేన పార్టీకి విరాళం ప్రకటించి అభిమానానికి హద్దులు లేవని చాటి చెప్పారు. ఈ సందర్బంగా ఎన్నారై అచ్చియ్యకి అనపర్తి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ జనసైనికుల తరపున అభినందనలు తెలిపారు.