మదనపల్లె బాహుదా కాలువ ఆక్రమణలు వెంటనే తొలగించాలి: దారం అనిత

చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత మాట్లాడుతూ.. మదనపల్లె పట్టణం మీదుగా దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవునా ప్రయాణిస్తూ ప్రజలకు తాగునీరు పంటలకు సాగునీరు ఇస్తుంది బహుదానది అధికారుల ఉదాసీనత నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు అక్రమ నిర్మాణాలు పెరిగిపోవడంతో 80 అడుగులకు పైగా ఉన్న ఉన్నది ప్రస్తుతం 30 అడుగులకు కుదించుకుని పోయింది 1996 జూన్లో భారీ వర్షాలు కురవడంతో పై భాగాన ఉన్న చెరువులు తెగిపోవడంతో మదనపల్లె పట్టణాన్ని వరద ముంచెత్తింది ఒకవైపు బాహుదా మరోవైపు బుగ్గ కాలువలో ప్రమాద స్థాయిలో వరదనీరు ప్రవహించడంతో భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాటిల్లింది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఆక్రమిత స్థలాల్లో ఇళ్ల నిర్మించుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు 2000 2014 అనంతరం సర్వే చేసి ఆక్రమణలను తొలగించడానికి అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది అనంతరం ఏం జరిగిందో ఏమో అధికారులు బహుద నది ఆక్రమణలను పట్టించుకోలేదు 2021 నవంబర్-డిసెంబర్ లో కురిసిన భారీ వర్షాలు మరోసారి మదనపల్లె పట్టణానికి ముంచెత్తాయి పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి ప్రాంతాల్లోని ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించి తాత్కాలికంగా ఆదుకున్నారు ప్రతిసారి వర్షాకాలంలో బహుదానది పరివాహక ప్రాంతంలోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు తాజాగా రుతుపవనాలు వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి తప్పదు ఇకనైనా ఆక్రమణల తొలగించి బాధితులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి ఉన్నత అధికారుల స్థాయిలో కఠినమైన నా నిర్ణయం తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మదనపల్లె జనసేన పార్టీ తరఫున దారం అనిత డిమాండ్ చేయడం జరిగింది.