శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మదనపల్లి జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్ సిటిఎం రోడ్డులో ఉన్న శివాలయంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన నాయకులు, శ్రీరామ రామాంజనేయులు కుటుంబ సభ్యులు మహా శివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీమతి దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్ బాబు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ ఆ మహాదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జనసేన-టిడిపితో కలిసి బిజెపి కూడా ప్రయాణం చేసి ఈసారి 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం ఖాయమని, 2024 ఎన్నికల్లో నాయకుల కన్నా ప్రజలు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసేందుకు సిద్దంగా ఉన్నారని ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూడడమైనది కాబట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తాను ఇంటికి పోవడానికి సిద్దమే అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, ధరణి, సిద్దు, రమేష్,జనసేన సోను, సుప్రీం హర్ష, నవాజ్, వీర మహిళలు మల్లిక, రూప, శోభ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.