ఒడిస్సా రైలు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన మదనపల్లి జనసేన

మదనపల్లి: ఒడిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారి అందరి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, గాయాలు అయిన వారు అందరూ త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి కోరారు. అమరులైన వారి ఆత్మ శాంతి కలగాలని కమ్మవీధి జనసేన పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు మౌనం పాటించారు.