రైల్వే కోడూరు జనసేన ఆధ్వరంలో మహాపాదయాత్ర

ఉమ్మడి కడప జిల్లా, రైల్వే కోడూరు నుంచి చిట్వెలి వరకు రోడ్డు విస్తరణకై ప్రభుత్వ అధికారులు స్పందించేలా రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, జోగినేని మణి, మైసురావారి పల్లి వెంకటేష్, జనసేన పార్టీ మైసురావారీ పల్లి సర్పంచ్ శ్రీమతి సంయుక్త, జనసేన పార్టీ ఎంపిటిసి నాగరాజుల అధ్వర్యంలో మహాపాద యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, చిత్తురు జిల్లా అధ్యక్షులు డా.హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జనసేన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యులు గత మూడు పర్యాయాల నుండి ఎన్నికై ఉండి కూడా రైల్వే కోడూరు నుండి చిట్వేలు వరకు గల రహదారిని డబుల్ లైన్ చేయకుండా… మేనిఫెస్టోలో పెడుతూ కూడా ఎటువంటి అభివృద్ధి చేయకుండా అలాగే వదిలేశారని ఆరోపించారు. దీని కారణంగా ఎంతోమంది గ్రామస్తులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని జనసేన నాయకులు ఆరోపించారు. దీని కారణంగా ఎన్నో వాహనాలు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా వైసిపి పార్టీ నాయకులు మరియు ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం చాలా విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ దారిని డబల్ లైన్ చేసి ప్రజలకు అనుకూలంగా మార్చాలని జనసేన పార్టీ రైల్వేకోడూరు విభాగం డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన టీ షర్ట్స్ మరియు టోపీలు ధరించి జనసేన నినాదాలు చేస్తూ ఉండగా తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో ర్యాలీగా జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు ర్యాలీ నిర్వహించి కోడూరు నుండి చిట్వేలి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంధంశెట్టి దినకర్ బాబు, జోగినేని మనీ, ఎద్దల అనంతరాయలు, ముత్యాల కిషోర్, రవి, పగడాల వెంకటేశు, రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన సెక్రటరీలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.