మీలాద్ ఉన్ నబి ఉత్సవాలలో పాల్గొన్న పోతిన మహేష్

విజయవాడ, జాషనే ఈద్ మీలాద్ ఉన్ నబి సందర్భంగా వన్ టౌన్ పంజా సెంటర్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ జుమ్మ మస్జిద్ వరకు దావతే ఇస్లామి ఆర్గనైజర్ సలీమ్ అధ్వర్యంలో నిర్వహించిన జనసేన పార్టీ విజయవాడ జులూస్ లో నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పాల్గొని అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులతో కలిసి జులూస్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎజాస్ షేక్, మహమ్మద్ ఇబ్రహీం, మీర్జా, మోబినా, సయ్యద్, కొరగంజి వెంకట రమణ, రెడ్డిపల్లి గంగాధర్, బత్తుల వెంకటేష్, పొట్నూరు శ్రీనివాస్, సాయి నాగోతి, దాసిన జగదీష్, పవన్ కళ్యాణ్, మురళి కృష్ణ, నరేష్, పిల్ల రవి, రామిశెట్టి మురళి, మద్దెల కనకారావు బావిశెట్టి శ్రీనివాస్, చిరంజీవి, రాము, సోమి మహేష్ పాల్గొన్నారు.