జనసేనాని జన్మదినోత్సవాలను విజయవంతం చేయండి: బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: నరసాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ మన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలి అని నాయకులకు, జనసైనికులకు పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు నిర్వహించడం, రెల్లి గ్రామాలను సందర్శించి అక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, బడుగు బలహీనర్గాల వసతి గృహాలను సందర్శించి వారికి అవసరమైన వస్తువులు అందించుట, పేదలైన వికలాంగులకు అవసరమైన వస్తువులు బహూకరించుట వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రతి కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తప్పక పాల్గొని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపికృష్ణ, వలవల నాని, మాదంశెట్టి కోటేశ్వరరావు, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మార్రజు, ఆకుల వెంకటస్వామి, గంట కృష్ణ, నిప్పులేటి తారక రామారావు, వాతాడి రమేష్, పోలిశెట్టి నళిని, సముద్రాల సత్యవాణి, బందెల ఎలేషా, పోలిశెట్టి సాంబ, పసుపులేటి అభి, గణేష్ని శ్రీరామ్, ఉప్పులూరి రాంబాబు, నియోజవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.