బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించడమే ఫూలేకు ఘననివాళి

తాడేపల్లిగూడెం, సమాజంలోని దురాచారాలను అరికట్టేందుకు అహర్నిశలు పాటుపడిన గొప్ప సంఘసంస్కర్త, బాలికల విద్యకోసం పాఠశాలలు స్థాపించిన నవయుగ వైతాళికుడు మహాత్మా జ్యోతీరావ్ ఫులే వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవబట్ల విజయ్ ఆధ్వర్యంలో పులే విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశవబట్ల విజయ్ మాట్లాడుతు బడుగుజీవుల మహాత్ముడు జ్యోతిరావు ఫూలే అని మూడు వేల దశాబ్దాలుగా పేరుకుపోయిన సామ్రాజ్యవాదపు కులోన్మాదాన్ని పునాదులతో కదిలించి సామాజిక విప్లవానికి ఫూలే నాంది పలికారు అని, ఆనాటి బడుగు జీవుల అనాగరిక జీవనానికి కారణం అవిద్య అని గ్రహించి, తన లక్ష్య సాధనకు భార్యనే ఎంచుకుని, సూద్రులకు పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే అని సత్యశోధక్ సమాజ్ ను స్థాపించి కార్మికుల, కర్షకుల కోసం, రైతుల కోసం పోరాడుతూ అగ్రవర్ణ అరాచకాలపై తిరుగుబాటు చేసిన ధీరోదత్తుడు ఫూలే అని బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం సాధించడమే ఫూలేకు ఘననివాళి అని అన్నారు. నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తుమరాడ చిన్న మాట్లాడుతు మహాత్మా జ్యోతిరావు ఫూలే అస్పృశ్యతా నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమించిన మహాత్ముడు అని దేశంలో 85 శాతానికి పైగా ఉన్న బహుజనులకు విద్యను అందిచిన మహనీయుడు అని, అంటరానితనం రూపుమాపడానికి సత్యశోధక సమాజ్ అనే సంస్థను ప్రారంభించి దానిద్వారా సమాజంలోని అవకతవకలను, అంటరానితనాన్ని, అసమానతలను రూపుమాపిన సామాజిక వేత్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన అద్యక్షులు అత్తిలి బాబి, జిల్లా ఉపాధ్యక్షులు మారిశెట్టి నరసింహ మూర్తి, నియోజకవర్గ కార్యదర్శి చొప్పా లక్ష్మణ్, బీసీ నాయకులు చందక రమణ, పతివాడ సాయి, ముదికి చక్రి, బైరెడ్డి పండు, బండ ప్రసాదు, వై కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.