మచిలీపట్నం సభను విజయవంతం చేయండి: గంజికుంట రామకృష్ణ

  • జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన నార్పల మండల జనసైనికులు

సింగనమల: మచిలీపట్నంలో జరిగే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు పెద్ద సంఖ్యలో నార్పల మండల జనసైనికులు తరలివెళ్లారు. మార్చి 14 తేదీన మచిలీపట్నంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించలేని విధంగా ఘనంగా దాదాపు 36 ఎకరాలలో సభను నిర్వహించడం జరుగుతోందని, ఈ వేదిక సభా ప్రాంగణానికి శ్రీ పొట్టి శ్రీరాములు చైతన్య వేదికగా నామకరణం చేశారన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కీలకమన్నారు. వచ్చే సర్వత్రిక ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు పోవాలో, విధి విధానాలు గురుంచి జనసేన శ్రేణులకు, నాయకులకు అధినేత దిశా నిర్దేశం చేయడం జరుగుతుందన్న విస్తృత ప్రచారంతో ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని, సభలో అధినాయకుడు పవన్కళ్యాణ్ గారు ఏమి మాట్లాడుతారో అని జనసేన శ్రేణులు ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. జనసేనాని సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి తొందర్లో అధినాయకుడిని ముఖ్యమంతి చేసుకోవాలనే ధీమాతో కార్యకర్తకు పార్టీని ముందుకు నడిపిస్తామని తెలిపారు. ఆవిర్భావ సభకు ఎన్.ఆర్.ఐ యూ.ఎస్.ఏ వారి సహకారంతో ఏర్పాటు చేసిన బస్ లలో నార్పల మండలం నుండి పెద్దఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు, మండల నాయకులూ, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.