బిక్కవోలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అనపర్తి నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కుల కోసం, ఆధునిక భారతదేశం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆర్థికవేత్త, రాజకీయనేత భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131 జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించి.. అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన మండల తరుపున చల్లని మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పెదపూడి మండల అధ్యక్షుడు వీరాస్వామి, జనసేన నాయకులు నాగు, సుంకర బుజ్జి, వీర సాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, వినోద్ రెడ్డి, బిక్కవోలు జనసేన నాయకులు వెంకటరమణ, గోవిందు, పండు, సతీష్, హరీష్, శ్రీనివాస్, దుర్గ ప్రసాద్, చందర్రావు, కొర్ల చిన్న బుజ్జి, భీమశంకర్, రాజు, కొర్ల వీరబాబు తదితరులను ఇంచార్జి అభినందించారు.