కాకినాడ సిటిలో చలో మచిలీపట్నం పోస్టర్ ఆవిష్కరణ

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈనెల 14వ తేదీన మచిలీపట్నంలో తలపెట్టిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వాహణ నిమిత్తం పామర్రు నియోజకవర్గానికి ముత్తా శశిధర్, పాకంటి గౌతం కుమార్ మరియు తాడిసెట్టి నరేష్ లను ఇంచార్జ్ గా నియమించిన దరిమిలా శనివారం పామర్రులో ముత్తా శశిధర్ తనతోటి ఇంచార్జ్ లతో కలిసి పామర్రు జనసేన పార్టీ నియోజకవర్గ, మండల నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావసభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని జనసేన పార్టీ స్థాపించి అనతికాలంలోనే పార్టీ సిద్ధాంతాల ద్వారాప్రజలలోకి తీసుకెళ్ళడం జరిగిందనీ, తద్వారా ప్రజల మన్నన పొందుతున్నారన్నారు. ప్రజలకోసం తమ పార్టీ చేపడుతున్న మరియు చేపట్టబోయే విధానాలను ప్రజలకు తెలియచేస్తూ ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఈ సభలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు చేపడుతున్న ఏర్పాట్లపై తీసుకోవాలిసిన జాగ్రత్తలను సమీక్షించుకోడం జరిగిందన్నారు. ముఖ్యముగా సభలో పాల్గొనబోయే మహిళలకు ప్రత్యేకమైన ఏర్పాట్లను విశిదీకరించారు. పామర్రు నియోజకవర్గంలోని 100 గ్రామాలనుండీ ఈ సభలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారన్నారు. జనసైనికులు, వీరమహిళలు అందరూ క్రమశిక్షణతో ఈ సభలో పాల్గొని విజయవంతం చేయవలిసినదిగా ఆహ్వానించారు.