ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పి గన్నవరం జనసేన

రాజోలు నియోజకవర్గం, పి గన్నవరం, మామిడికుదువు మండలం జనసేన పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మర్చి 14న జరగబోయే 10వ ఆవిర్భావ సభకు అత్యధిక సంఖ్యలో మండలము నుండి బయలుదేరి వెళ్లి సభ విజయవంతమవవడానికి కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు సమైక్య అధ్యక్షులు అడబాల తాత కాపు, ఎంపీటీసీ సభ్యులు కొమ్మల జంగమయ్య, పోతు కాశీ, చిక్కం ప్రసాద్, కటకం శెట్టి కృష్ణ, మట్ట సత్తిబాబు, ప్రధాన కార్యదర్శులు మద్యం శెట్టి సుబ్బారావు, బత్తుల శేఖర్, కాట్రెంపాడు నాగేంద్ర, నేదురి రామారావు, కొమ్ముల రాము తదితరులు పాల్గొన్నారు.