జనసేన నిరసన ర్యాలీని విజయవంతం చెయ్యండి

పాడేరు: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనగా జులై 18వ తేదీన జనసేన నాయకులు మండల ప్రధాన కేంద్రమైన జి.మాడుగుల నుంచి సంతబయలు వరకూ సుమారు నాలుగు కిలోమీటర్ల మేర జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో జనసైనికులకు, వీరమహిళలు సమాచారం ఇస్తూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేనపార్టీ ద్వారా మా ప్రశ్నకు బదులేది అనే కరపత్రాన్ని ప్రజలకు పంచి పెట్టారు. వాస్తవ రాజకీయాలపై గిరిజన ప్రజలకు అవగాహన కల్పిస్తూ రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దామంటూ జనసేన నాయకులు గ్రామాబాట పట్టారు. ఈ సందర్బంగా 18వ తేదీన నిర్వహించే బారి ర్యాలీకి అభిమానులు, జనసైనికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. గ్రామబటలో పాల్గొన్నా జనసేనపార్టీ జి. మాడుగుల మండల నాయకులు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, మండల అధ్యక్షులు మసాడి భీమన్న, ఉపాధ్యక్షులు సాగెని ఈశ్వర్రావు, కార్యనిర్వహన అధ్యక్షులు తాంగుల రమేష్, కొర్ర భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.