హౌస్ అరెస్ట్ లు చేయడం వైసీపీ పతనానికి నాంది: దూదేకుల సలీం

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా గుంటూరు నగరంలో తలపెట్టిన శాంతి ర్యాలీకి వెళ్లకుండా అర్ధరాత్రి ముందస్తు నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ లు చేయడం దారుణమని, రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చావడానికి ఐదు కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో నిరసన తెలియజేసే హక్కును వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. జనసేన, టీడీపీ కలిసివస్తే ఓటమి తప్పదనే భయం తోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం అభిప్రాయపడ్డారు.