ఈస్టర్ వేడుకల్లో మాకినీడి శేషుకుమారి దంపతులు

పిఠాపురం మండలం మల్లం గ్రామంలో క్రైస్తవ సోదరులు ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ మల్లం గ్రామంలో చర్చ్ కి వెళ్లి సోదరులందరికీ ఈస్టర్ – శుభాకాంక్షలు తెలియజేసి ఏసుప్రభు ఆశీస్సులు తీసుకుని ప్రార్థన చేయించుకున్నారు. క్రీస్తు పునరుత్థానం గావించిన రోజు సందర్భంగా నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లం గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యకరావు గోపు సురేష్, దేశరెడ్డి సతీష్, కంద సోమరాజు, తదితరులు పాల్గొన్నారు.