మల్కాజిగిరి నియోజకవర్గ జనసేన విస్తృతస్థాయి సమావేశం

తెలంగాణ ఎన్నికల కసరత్తులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం కార్య నిర్వాహక సభ్యులు వెంకట చారీ ఆధ్వర్యంలో మరియు తోట అజయ్ బాబు, రమేష్, సాయి బాబు ప్రవీణ్, శ్రీనివాస్, రియాజ్, సుజాత సాయి యాదవ్ ల పర్యవేక్షణలో జనసేన శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పర్యవేక్షణ బృందం సభ్యులు రాధారం రాజలింగం, మేకల సతీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రత్న పిల్లా, లిఖిత పాల్గొని రాబోయే ఎన్నికల కొరకు జన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.