40వ డివిజన్లో హనుమాన్ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వేడుకలు

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ సూచనలతో సంక్రాంతిని పురస్కరించుకొని “మన ఊరు మన ఆట” కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి 40వ డివిజన్ కోఆర్డినేటర్ ఎం. హనుమాన్, శ్యామ్ మరియు దుర్గారావు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొని ముగ్గుల పోటీలో విజేతలకు మరియు పోటీలో పాల్గొన్న వారికి బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి తిరుపతి అనూష, శ్రీమతి మల్లెపు విజయలక్ష్మి, స్టాలిన్ శంకర్ మరియు 40 డివిజన్ నాయకులు నాగార్జున, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.