మండల అధ్యక్షులకు పేడాడ ఆధ్వర్యంలో ఘన సన్మానం

ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ నందు ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే నియమించిన మండల అధ్యక్షులైన బుర్జ మండల అధ్యక్షులు కొత్తకోట నాగేంద్ర, పొందూరు మండల అధ్యక్షులు యలకల రమణ, సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్ లను ఉత్తమ నాయకులుగా గుర్తించి, పుష్పగుచ్చం ఇచ్చి గౌరవంగా సన్మానించి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మండల అధ్యక్షులను ఉద్దేశిస్తూ పార్టీ మీకు అప్పజెప్పిన పూర్తి బాధ్యతలను నిర్వర్తిస్తూ.. మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. మండలంలో పార్టీ బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంటూ ముందుకు వెళ్లాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం నాయకులు పాత్రుని పాపారావు, బాల మురళి, ధనుంజయ్, రమణ, అనూష్ కుమార్, అశోక్, రాంబాబు, అప్పలరాజు, సురేష్, బాలకృష్ణ, రాజు, రమేష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.