అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళ సూత్రాలు బహూకరణ

పాలకొల్లు నియోజకవర్గం: పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జనపరెడ్డి లక్ష్మీనారాయణ దినసరి కూలీ వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. కొన్ని రోజుల క్రితం పని చేస్తూ భవనం 3 అంతస్తులపై నుండి కింద పడి దురదృష్టవశాత్తు మంచానికె పరిమితం అయ్యారు. ఆయన కుమార్తె యజ్ఞశ్రీకి ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది, ఇంటి పెద్ద మంచానికే పరిమితం కావడంతో కుటుంబం జీవనం కూడా కష్టతరంగా మారింది. కుటుంబ సభ్యులు పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతున్నాం అని మా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ నీ సహాయం కోరగా వారి పెళ్లికి కావలసిన 25,000 రూపాయల విలువైన మంగళసూత్రాలు చేగుండి హరి రామ జోగయ్య చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నంశెట్టి గోవర్ధన్, అనంతపల్లి సతీష్, యింటి శరణ్ బాబు, పామర్తి బాలు, గమ్మిడి మహేష్, నాగసాయి పాల్గొన్నారు.