పోతిన మహేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహము భవానిపురం నందు 25 వేల రూపాయల విలువచేసే 68 జతల చెప్పులు, 1 గ్రీన్ బోర్డ్, 4కుర్చీలు మరియు స్వీట్స్ అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి అనూష, ఎం హనుమాన్ తమ్మిన లీలా కరుణాకర్, లింగం శివప్రసాద్, సోమీ మహేష్, బావిశెట్టి శ్రీనివాస్, నేర్జి శ్యామ్ అఖిల్ నాయుడు జయకృష్ణ తమ్మిన అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన లింగం శివప్రసాద్ కు మహేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.