మార్గాని వీర రాఘవులు కుటుంబాన్ని పరామర్శించిన బండారు

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని, ఆలమూరు గ్రామం నందు సోమవారం జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గం ఇన్చార్జి బండారు శ్రీనివాస్ పర్యటించారు. ఆలమూరు గ్రామంలో ఉంటున్న మార్గాని వీర రాఘవులు కొద్ది రోజులు క్రిందట స్వర్గస్తులైన కారణంగా, వారి కుటుంబాన్ని కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం వీర రాఘవులు స్వర్గస్తులైన కారణంగా వారి కుటుంబం ఎంతో ఆవేదనతో ఉన్న కారణంగా, ఆ కుటుంబమునకు చెందిన వారి కుమారులు మార్గాని సిందిల్ కుమార్, మార్గాని వీరబాబును కలిసి, ఎంతో ఆత్మీయతతో వారి కుటుంబ యోగక్షేమాలను, సమాచారమును తెలుసుకుని, వారిని ఓదార్చి ఎంత ధైర్యంతో ఉండాలని తెలియజేస్తూ, కుటుంబ పెద్దలు లేని లోటు చాలా వెలకట్టలేనిదని, వారితో ఒక సొంత కుటుంబ సభ్యుని వలె ఆత్మీయతతో పరామర్శ చేయడం, ఎంతో ఆత్మీయతను కూడిన మాటలు, ధైర్యము తెలుపుతూ ఉండడం, అక్కడ ఉన్న పెద్దలు అందరూ బండారు శ్రీనివాస్ యొక్క వ్యక్తిత్వం, ఎంతో గొప్పగా ఉన్నదని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రేపు రాబోయే నాయకుడుగా, ప్రజల మనిషిగా ఈ కొత్తపేట నియోజకవర్గంను చల్లగా చూస్తారని, చూడాలని, పలువురు బండారు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు ముందుగానే అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖ జనసైనికులు, నాయకులు కార్యకర్తలు కలిసి మార్గాని వారి ఇంట కష్టసుఖాలను పంచుకుంటూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పలువురు ప్రముఖులు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, జనసేన గ్రామ అధ్యక్షులు కట్టా రాజు, పెట్టా రంగనాథ్, లంకే సతీష్, దాసి మోహన, గుడాల నాగబాబు, పసుపులేటి సాయిబాబా షేక్ ఖాసిం చల్లా వెంకటేశ్వరరావు, శిరిగినీడి పట్టాభి, కోట వరలక్ష్మి, కొండేటి హేమ దేవి, కొండేటి అప్పారావు, పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.