పెంచిన విద్యుత్ ఛార్జిలకు మార్కాపురం జనసేన నిరసన

మార్కాపురం, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ లో పెంచిన విద్యుత్ ఛార్జిలకు నిరసనగా మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ కార్యాలయం నుండి భారీ జనసందోహంతో మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ వెళ్ళి మార్కాపురం ఆర్డీవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియా ముఖంగా ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలపై రూ.4,310 కోట్ల విధ్యుత్ భారం ప్రభుత్వం మోపిందని. ప్రజలు ఆర్ధికంగా సతమతం అవుతున్న వేళ 225 యూనిట్ల లోపు వాడే పేదలకు రూ.1.57 పెంచడం దారుణమని, పేద మధ్యతరగతి ప్రజలపై అన్నీ రకాల ధరలను పెంచి బాదుడే బాదుడు గా వ్యవహరిస్తున్న తీరు భాదాకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు, తిరుమలశెట్టి వీరయ్య, ఎన్.వి. సురేష్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్ , తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, పొదిలి మండల అధ్యక్షులు పేరిసోముల శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం కమిటి సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, ఇమ్మడి నాగ సుందరి, పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పూజ లక్ష్మీ, సువర్ణ, పిన్నెబోయిన శ్రీను, శీరిగిరి శ్రీను, సంగటి వెంకటేశ్వర్లు, శేఖర్, సాధిక్, రఫీ, జానకి రామ్, షరీఫ్, ఫణి, పోటు వెంకటేశ్వర్లు, ఖాజా వలి, రామిరెడ్డి, పుల్లయ్య, నాగుల్ మీరా, కొండలు, రమేష్, జనసేన వీర మహిళలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.