పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి: కర్నూలు జనసేన

  • రాజవిహార్ నుండి కలెక్టరేట్ వరకు జనసేన నాయకులు ర్యాలీ
  • విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే దశలవారీ ఉద్యమాలను చేపడతాం
  • ధర్నా కార్యక్రమంలో జనసేన నాయకుల హెచ్చరికలు

కర్నూలు, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతాసురేష్ బాబు మాట్లాడుతూ చార్జీలను విపరీతంగా పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల పై మోయలేని భారం మోపుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో జనం అల్లాడిపోతున్నారు అని, దీనికితోడు విద్యుత్ చార్జీలు కూడా పెంచితే పేద ప్రజలు ఎలా భరిస్తారు అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కరెంటు చార్జీల మోత మోగింది అని, పది రోజుల క్రితం తెలంగాణలో కరెంటు చార్జీలు భారీగా పెరిగాయి అని ఏపీలో కూడా విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచేశారు అని ఆయన తీవ్రంగా విమర్శించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కొనలేని విధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు అని అన్నారు. చార్జీల మోత మోగిస్తుంటే.. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు వాత పెడుతున్నాయి అని అన్నారు. ప్రభుత్వ విధానాలు సగటు జీవికి భారంగా పరిణమిస్తున్నాయి అని విమర్శించారు. జనసేన నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఎస్ యమ్ డి మహబూబ్ బాషా మాట్లాడుతూ.. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిగేలా రెండు రోజుల క్రితం ఏపీలో విద్యుత్‌ చార్జీలు పెంచుతూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఏపీలోనూ కరెంటు చార్జీలు భారీగా పెంచేశారు అని తీవ్రంగా విమర్శించారు. డిస్కమ్‌ల ప్రతిపాదనల మేరకు ఏపీఈఆర్సీ విద్యుత్‌ చార్జీలు పెంచింది అని ఇవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి అని అన్నారు. ఒక్కో యూనిట్‌కు కనిష్టంగా 45 పైసల నుంచి గరిష్టంగా ఒక రూపాయి 57 పైసల దాకా అదనంగా పెరిగాయి అని అన్నారు. అయితే వినియోగించే యూనిట్లతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికీ చార్జీలు పెంచేశారు అని విమర్శించారు. జనసేన పార్టీ రాయలసీమ విభాగం వీర మహిళ కోఆర్డినేటర్ ఎస్.యమ్.డి హసీనా బేగం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలపై విద్యుత్ భారాలు మోపడం సరైన విధానం కాదని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మిగులు విద్యుత్ తో ఉంటే ఇప్పుడు లోటు రాష్ట్రంగా మారిందని అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో ప్రజలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు విలవిలలాడిపోతూ ఉన్నాయని దానికి తోడు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తే ప్రజలు ఏమై పోతారు అని ఆమె ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్న జగన్ మాట తప్పారని అన్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచి అన్ని వర్గాల ప్రజలపై రూ.1400 కోట్ల భారం వేశారని అంతేకాకుండా.. ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ3వేల కోట్ల బారం వేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించారని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్షద్, ఎమ్మిగనూరు ఇన్చార్జి రేఖా జావాజి, పవన్, ఆదోని ఇంచార్జ్ మల్లప్ప, పోలూరి వెంకట సుబ్బయ్య, చల్ల వరుణ్, శీను, రాము, అనిత శ్రీ, సుధాకర్, బ్రహ్మం మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-01-at-8.06.51-PM-1024x493.jpeg