వైస్సార్సీపీ నుండి జనసేన పార్టీలోకి భారీగా వలసలు..

  • రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట ఎస్సీ పేటలో వైసీపీకి షాక్ ఇచ్చిన పలువురు నేతలు, కార్యకర్తలు…
  • జనసేన పార్టీలో జాయిన్ అయ్యిన వారిలో పెద్దఎత్తున మహిళలు, గ్రామపెద్దలు…

రాజానగరం: సీతానగరం మండలం, ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన ఎస్సీ పేట నుండి వైసీపీకి చెందిన సుమారు 200 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి, కొండేటి సత్యనారాయణ, పెంటపాటి శివ ఆధ్వర్యంలో…జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి,, అలానే నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ దమ్మున్న నాయకత్వం, రాజానగరం నియోజకవర్గంలో విస్తృతంగా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు నచ్చి… మరియు ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తూ…. సామాన్యుడి జీవితాన్ని ఛిద్రం చేస్తున్న ఈ వైసిపి అసమర్థపు పాలనకు విసుగు చెంది.. వీరందరూ జనసేన పార్టీలో బత్తుల దంపతుల సమక్షంలో జాయిన్ అయ్యారు.. జాయిన్ అయిన వారిలో బత్తు మణి, విరెల్ల పోచమ్మ వినపాక వెంకటలక్ష్మి, విన్నపాల రాణి, బత్తు సుబ్రమణ్యం, మైలబత్తుల మరియమ్మ, వేరిల్ల బేబీ, వెరిల్ల ధనలక్ష్మి, సరికల కుమారి, జిత్తుక సునీతమ్మ, బత్తు చిన్నారి, బత్తు ధనలక్ష్మి, గంటి లక్ష్మీ, బర్రె సుదర్శిని, తవిటిక మరియమ్మ, తవిటిక మరియమ్మ, తవిటిక నవీన, వేరిల్ల సుబ్బలక్ష్మి, గుడిసె లక్ష్మి, గుంటి అచ్చియమ్మ, మైలబత్తుల మేరీ, సన్నప శాంతి, పల్లి దుర్గ, గాడి కుమారి, పొలమాటి సింధు, కరమంది పొసమ్మ, నాగిరెడ్డి వెంకటలక్ష్మి, ఇనపాల రమ్య, సింతపల్లి రమణమ్మ, సింతపల్లి వేణి, గాడి అనుషా, గుంటు మేరీ, గూడల బేబీ, బొత్తు గంగాభవాని, కొయ్యా గంగాభవాని, తలారి ధనలక్ష్మి, బత్తు మేరీ, బత్తిన పొసమ్మ బత్తు మంగమ్మ, గుంట చిన్న లక్ష్మి, వేరిల్ల ఉష ,మరియు స్చ్ పేట గ్రామ పెద్దలు మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇనుగంటివారిపేట జనసేన నేతలు, రాజానగరం నియోజకవర్గ స్థాయి, సీతానగరం మండల స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.