అనుశ్రీ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు

రాజమండ్రి సిటీ: స్థానిక 39వ వార్డ్ నుంచి కృష్ణానగర్ ఫ్రెండ్ సర్కిల్ దుర్గాప్రసాద్, కోళ్ల పరదేశ్, సుంకర సతీష్, అయినా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన 70 మంది సభ్యును జనసేన రాజమండ్రి సిటీ ఇన్చార్జి అను శ్రీ సత్యనారాయణ చేతుల మీదగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ జనసేన అని ఘంటాపదంగా తెలియజేశారు. చదువుకున్న యువత, విజ్ఞులు రాష్ట్ర శ్రేయస్సు కోసం మద్దతుగా నిలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు పైడ్రాజు, వీరబాబు పాల్గొన్నారు.