ఉంగుటూరు జనసేనలో భారీ చేరికలు

ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు గ్రామం నుండి ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో టిడిపి మరియు వైసీపీ పార్టీల నుండి పలువురు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాల నచ్చి కన్నాజి సూరిబాబు, దేవిరెడ్డి సుబ్బారావు, కన్నాజి నాగబాబు, చల్లంశెట్టి సురేష్, బొచ్చు గణేష్, కూచిపూడి హనుమంతరావు, రెడ్డి పోతురాజు, గొర్ల లచ్చన్న, శివాల త్రిమూర్తులు, తట్టుబోలు ఏసు, పాండ్రంగి సింహాచలం, చెల్లంశెట్టి గంగాధర రావు వారి అనుచరులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చిన్న రత్తయ్య, జనసేన పార్టీ నిడమర్రు మండల అధ్యక్షులు నిమ్మల దొరబాబు, ఉంగుటూరు నియోజవర్గ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ అయితం దుర్గాప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకులు వంగా రఘు, చింతలపాటి బాసి రాజు, బెతు మురళి, తోట పవన్, తానేటి జోగేశ్వరరావు, నిడమర్రు గ్రామ కమిటీ సభ్యులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.