చంద్రగిరి జనసేనలో భారీ చేరికలు

  • జనసేన జిల్లా కార్యదర్శి మనోహర ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్న 50 కుటుంబాల ప్రతినిధులు
  • రైతులకు పనిముట్లు పంపిణీ మరియు అణగారిన రైతాంగానికి వాటర్ ట్యాంకర్ వితరణ

తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, యర్రావారిపాళెం మండలం, ఉదయమాణిక్యం పంచాయితీ, కోరువాండ్ల పల్లెలో జనసేన పార్టీ అధ్యక్షులు సూచించిన విధంగా చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి, కార్యక్రమంలో భాగంగా ఉదయమాణిక్యం పంచాయతీలో స్థానిక వైసీపీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో ఎరుకలపల్లి నుంచి 50 కుటుంబాల ప్రతినిధులు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి దేవర మనోహర ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరారు. పార్టీలో చేరిన సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన దేవర మనోహర మరియు నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు. కార్యక్రమంలో భాగంగా దేవర మనోహర రైతులకు పనిముట్లు పంపిణీ మరియు అణగారిన రైతాంగానికి వాటర్ ట్యాంకర్ వితరణ చేసారు.