పెదబయలు మండలంలో జనసేనలో భారీ చేరికలు

పాడేరు: విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అరకు విచ్చేసిన సందర్భంగా పెదబయలు మండల జనసేన పార్టీ నాయకులు జాగరపు పవన్ కుమార్ జాగరపు కళ్యాణ్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అదేవిధంగా జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ ఆధ్వర్యంలో పెదబయలు మండలం నుండి సుమారుగా 40 మంది సభ్యులు జనసేన పార్టీలో చేరారు. ఈ సమావేశంలో అరకు ఇంచార్జ్ పంపూరు గంగులయ్య మరియు జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.