పొదిలిలో ఘనంగా వరికూటి సోదరుల జన్మదిన వేడుకలు

  • వరికూటి సోదరుల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పొదిలి పట్టణ బీసీ కాలనీ జనసైనికులు

పొదిలి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు వారి సోదరులు వరికూటి సురేష్ ల పుట్టినరోజు సందర్భంగా పొదిలిలో వరికూటి అభిమానులు వారి పుట్టినరోజును పురస్కరించుకొని పొదిలి పట్టణంలో ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు ఫ్రూట్స్ పంపిణీ చేసి తదనంతరం జనసైనికులు అందరూ పొదిలిలోని విశ్వనాధపురం వరికూటి నాగరాజు కార్యాలయం నందు భారీ కేక్ ను జనసైనికుల సమక్షంలో కట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డి.ఇ.ఓ బద్దుల లక్ష్మయ్య, బెల్లంకొండ విద్యాసంస్థల అధినేత బెల్లంకొండ శ్రీనివాస రావు, గడ్డిపాటి వేణుగోపాల్, గనప శ్రీనివాసులు, పొన్నూరు శ్రీకాంత్, గజ్జా అనిల్, తోట లోకేష్ నాయుడు, షేక్ మస్తాన్, మదన్, దుర్గా, హరి, జన హరికృష్ణ, రామ్ – లక్ష్మణ్, షరీఫ్, కరిముల్లా మరియు జనసైనికులు పాల్గొనడం జరిగినది.