సయ్యద్ కాంతిశ్రీ అధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు

  • జనసేన తీర్ధం పుచ్చుకున్న 200 కుటుంబాలు
  • జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేన నాయకులు

ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల జనసేనలో భారీ చేరికలు జరిగాయి. ఆదివారం సాయంత్రం ఎచ్చెర్ల జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ అధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ పిఏసి సభ్యురాలు మరియు విజయనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్విని మరియు రాష్ట్ర కార్యనిర్వహణ కమిటి వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ సమక్షంలో ఆదివారం రణస్థలం మండలం వైఎస్సార్సిపి మరియు టిడిపి పార్టీల నుండి సుమారు 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి జనసేన పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఇంతమంది జనసేనలో చేరడం మార్పుకు చిహ్నం అని, మార్పు మొదలైందని, ఎవరూ ఎవరికీ భయపడాల్సిన పని లేదని, జనసేన పార్టీ ఎపుడూ అండగా ఉంటుందని, ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని, 2024లో నియోజకవర్గంలో జనసెన జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బలరాం, కరుమజ్జి మల్లేశ్వరరావు, రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.