వారాహి విజయ యాత్రతో వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది

  • టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఉలికిపాటు ఎందుకు?
  • జనసేన-టీడీపీ కూటమికి కాపులను దూరం చేయాలనే కుట్రలు ఫలించవు
  • అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నానీలకు మతి భ్రమించింది
  • పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలితే డిపాజిట్లు కూడా దక్కవు
  • జనసేన నాయకుడు మండలి రాజేష్

పెడన: వారాహి విజయ యాత్ర విజయవంతం కావడంతో వైసీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని జనసేన నాయకులు మండలి రాజేష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నాలుగో విడతలో భాగంగా పెడన నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ విజయవంతం అవ్వడంతో జోగి రమేష్ కు మతి భ్రమించి పవన్ కళ్యాణ్ యాత్ర అట్టర్ ప్లాప్ అని, సభకు జనం రాలేదని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని జోగి రమేష్ వైఎస్సార్ సీపీ నాయకులు మంత్రి పదవులు చేపట్టిన దగ్గర నుంచి వారికి కళ్ళు కనిపించడం లేదు, చెవులు వినిపించడం లేదు. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదవడం తప్ప, మొన్న అవనిగడ్డ సభను ఉద్దేశించి గుంటూరుకు చెందిన ఒక ఆంబోతు మంత్రి అవనిగడ్డ సభకు జనం రాలేదు అట్టర్ ప్లాప్ అంటాడు, అక్కడ జరిగినటువంటి బహిరంగసభలో జనసందోహం చూసి కళ్లు మూసుకుపోయాయి, అయ్యా అంబటి రాంబాబు ఒక్కసారి కళ్ళు తెరిచి అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభ దినపత్రికల్లో వచ్చిన ఫోటోలు, మీడియాలో వచ్చిన వీడియోలు సజ్జల కళ్ళతో కాకుండా నీ కళ్ళతో చూడు అది ప్లాపో సూపర్ సక్సెస్ అనేదే నీకే తెలుస్తుంది. జోగి రమేష్ పెడనలో సభకు వచ్చిన జన సందోహాన్ని కళ్ళు తెరిచి చూడు జోగి రమేష్ వంగవీటి మోహన రంగా గారిని చంపిన టిడిపి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అంటున్నాడు 2019 ఎన్నికలకు ముందే వంగవీటి రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారు తన తండ్రిని కొంతమంది వ్యక్తులు చంపారని, తెలుగుదేశం పార్టీకి తన తండ్రి మరణానికి సంబంధం లేదని చెప్పి ఆనాడే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. నా తండ్రిని టిడిపి పార్టీ చంపలేదని రంగా గారి తనయుడు రాధ కృష్ణ చెప్తుంటే నువ్వు ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నావ్. జోగి రమేష్ కి జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని భయం పట్టుకుని, జనసేన తెలుగుదేశం పార్టీలకు ప్రజలను దూరం చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావ్. చంద్రబాబు, పవన్ కలయిక పాయిజన్ తో సమానం అంటున్నావ్. అవును అదే పాయిజన్ మీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సభ సాక్షిగా వైఎస్సార్ సీపీ 15 స్థానాలు కూడా గెలుస్తుందో లేదో అని చెప్పారు. అయ్యా జోగి రమేష్ నువ్వు పెడన నియోజకవర్గంలో గెలవలేవు, నీ సొంత నియోజక వర్గం మైలవరంలో కూడా గెలవడం అసాధ్యం. అసలు నువ్వు గానీ నీతో పాటు ఉన్న శాసన సభ్యులు గానీ కోస్తాంధ్రలో ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. ఇది నా మాట కాదు మీలో కొంతమంది శాసన సభ్యులు అన్నమాటే, అందుకని నీకు నేనొక సలహా ఇస్తా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి అయ్యా నేను అందరూ శాసన సభ్యులు కన్నా మంత్రుల కన్నా ఎక్కువ విశ్వాసం చూపించాను. కోస్తాంధ్రలో ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదు కావున నాకు రాయలసీమలో, పులివెందులలో సీటు ఇప్పించమని మీ అధినాయకుడు కాళ్ళు పట్టుకుని సీటు తెచ్చుకో లేకపోతే నీకు నీ కొడుక్కి భవిషత్ శూన్యం. జోగి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం గారిని అవమానించి కొట్టించిన టిడిపితో కలవడం కాపులు క్షమించరు అంటాడు. ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు గారు అవమానించారా కొట్టారా?, లేక చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ అవమానించారా కొట్టారా? ముద్రగడ ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్ సీపీ పార్టీలో ఉన్నారా? వంగవీటి రంగా మరణం తర్వాత కూడా తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేశారు ఒకసారి గుర్తు తెచ్చుకో. కేవలం జనసేన టిడిపి పొత్తును కాపులకు దూరం చేయాలని విష ప్రచారం నువ్వు నీ పార్టీ చేస్తుంది. దానిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పాలించే అలవాటు నీకు మీ నాయకుడికి, తాడేపల్లి ప్యాలెస్ కి వెన్నతో పెట్టిన విద్య మీరు ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, ఓటమి భయంతో మచిలీపట్నం శాసనసభ్యుడు మాజీ మంత్రి పేర్ని నాని కూడా నేను పోటీ చేయనని తన తనయుడికి సీటు ఇవ్వాలని సాక్ష్యాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాడు ఓడిపోతాను అన్న భయంతోనే తన తనయుడిని పోటీ చేయించాలని అనుకుంటున్నాడు” అని అన్నారు. ఎవరైతే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు, చవాకులు పేలతారో వారికి గెలుపుసంగతి తర్వాత డిపాజిట్లు కూడా రావని హెచ్చరిస్తున్నాను. మా అధ్యక్షులు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి” అని మండలి రాజేష్ హెచ్చరించారు.