శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి

నటుడు శ్రీ నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు లోను కావడం బాధాకరమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. శ్రీ తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.