శ్రీ కె.సి.ఆర్. కి జన్మదిన శుభాకాంక్షలు

భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్.) గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రజా జీవితంలో తనదైన పంథాను కలిగిన శ్రీ కె.సి.ఆర్. గారికి సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆయన అన్నారు.