ఇఫ్తార్ విందులో పాల్గొన్న మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, ఇనగంటివారిపేట మదీనా మసీద్లో 300 మంది ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందుకు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూపదేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ పోగ్రామ్ కమిటీ మెంబర్ & ముస్లిం సోదరుడు జమాల్ హాలీ (సోను)హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కో- ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, జనసేన పార్టీ సీతానగరం మండల కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, తణుకు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి చిడిపి నాగేష్, దుబాయ్ శ్రీను, గేదల సత్తిబాబు,జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి రాజానగరం మండల యూత్ ఐకాన్ పల్లా హేమంత్, గ్రామ జనసేన పార్టీ నాయకులు బాషా, కొండేటి సత్య పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.