ముత్తా శశిధర్ నివాసంలో మీడియా సమావేశం

కాకినాడ సిటీ: ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఉధృతంగా ఉందని పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఏర్పాటు చేసిన యువశక్తి బహిరంగ సభలో సుమారు 35 మంది యువకులు విభిన్న కోణంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చారని నేటి పాలకుల అవగాహన రాహిత్య పాలనకు యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. దానికి తగినట్లుగానే కాకినాడ గృహలబ్ధిదారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. సుమారు 16 వేల కుటుంబాల నుండి రూ. 35 వేల రూపాయలు కట్టించుకుని మోసం చేస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. కోమరిగిరి లేఅవుట్ కు సుమారు వారం రోజులు నుండి దారి లేకుండా చేశారని ఇంటర్నల్ లే అవుట్ ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా ఇంటర్నల్ రోడ్ కనెక్టివిటీ కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని అధికారులు గుర్తించాలని శశిధర్ తెలిపారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు కట్టిన 35 వేల రూపాయలు సొమ్ములకు బ్యాంక్ లో వడ్డీ పెరుగు పోతుందని ప్రభుత్వం స్పందించి తమకు కట్టిన నగదుకు వడ్డీ రాయితీ కల్పించి ఆదుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర యువశక్తి కార్యక్రమం విజయవంతం కాకుండా చేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నినా దానిని జనసైనికులు త్రిప్పి కొడుతూనే ఉన్నారని తెలిపారు. తనకు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ గా చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని జనసేన పార్టీ పిఎసి సభ్యులు, కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, వాసిరెడ్డి శివ, దుర్గాప్రసాద్, రవిశంకర్, దళిత మహిళలు బట్టు లీల, బోడపాటి మరియా, సుజాత, రమణమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు.