జనసేన పార్టీ మడకశిర నియోజకవర్గం మీడియా సమావేశం

మడకశిర నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వరుణ్, హిందూపూర్ ఇంచార్జ్ ఉమేష్ ఆదేశాలు మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

మడకశిర నియోజకవర్గం అనేది ఒక ఎస్సి కాన్స్టెన్సీ కానీ ఇక్కడ దళితులకు ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంకా రాజరికపాలని ఈ నియోజకవర్గంలో కొనసాగుతుంది ఎప్పుడు దళితులను చిన్నచూపు చూస్తే రాజకీయ నాయకులే ఉన్నారు కానీ ఎంతవరకు దళితవాడలను గాని, దళిత యువతీ యువకులు గాని ఉన్నతమైన చదువుల కోసం గానీ వారి జీవన విధానాల గురించి గానీ ఆలోచించిన పాపాన పోలేదు. ఎక్కడ ఉన్న పాకలు అలాగే ఉన్నాయి.. ఎలాగున్నా అక్క, చెల్లెలు.. అవ్వ, తాతలు అలాగే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడ వీరికి అభివృద్ధి జరిగిందని వాళ్లకు ఆలోచన ఉండదు. ఎలాంటి చదువుకోవడం గానీ మంచి వాతావరణంలో ఉండాలని భావన మా దళితవాడలకు ఉండదు. ఎక్కడకు వెళ్లినా కించపరిచే మాటలు ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కొనసాగిస్తున్నాయంటే ఎంతో దురదృష్టకరం. జనసేన పార్టీ మడకశిర నియోజకవర్గంలో ప్రజల సమస్యల పట్ల పోరాటానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడూ గళం విప్పుతుంది. ఎలాంటి రాజకీయ బెదిరింపులకు గాని.. వ్యక్తిగత దూషణలు గాని.. అసభ్యకరమైన పదజాలం వాడడం మా పార్టీ సిద్ధాంతం కాదు. ప్రజల సంక్షేమమే యావత్ మంది ప్రజానీకానికి ఒక మంచి అభివృద్ధి కలిగిన సమాజాన్ని ఇవ్వడమే మా జనసేన పార్టీలక్ష్యం. ఎలాంటి సమయంలో ఎలాంటి ప్రజానీకం వచ్చి జనసేన పార్టీ అండదండలు కావాలని వచ్చినా వారికి అనుక్షణం మీ కోసం ఉంటామని బాధ్యతగల రాజకీయాన్ని చేయడానికి ప్రజల కోసమే ఉందని తెలియజేసారు. గతంలో 30 సంవత్సరాల్లో రాజకీయ విమర్శలు వ్యక్తిగతగా విమర్శించిన దాఖలు ఒక వర్గం పార్టీ నాయకులు అవినీతి వరుడు అని సంబోధిస్తున్నారు. వర్గం అవినీతికి పెట్టిన పేరు నువ్వే సంబోధిస్తావని ఇంకొక వర్గం పార్టీ నాయకులు ఎన్నడు ఇలాంటి మడకశిర నియోజకవర్గంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రాజకీయ విమర్శలు చూస్తున్నాం. ఎందుకు ఈ ఆరాటం ఎవరికోసం ఈ ఆందోళన. మనల్ని గెలిపించిన ప్రజానీకానికి మన ఏ విధంగా సహకారం అందిస్తున్నామని అధికార పార్టీకి ఊసే లేదు. ఇంకొక ప్రతిపక్ష పార్టీ తాను ఎంతో బాధ్యతగా వ్యవహారించాల్సిన బాధ్యత ఉండి కూడా.. ఇలా విమర్శలకే ఆగిపోవడం ఎంతవరకూ న్యాయం. ఇంతలా ఇరు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా వారి వారి పంచాయతీలో వార్డుల్లో ఇంతవరకు ప్రజా సమస్యలను తీర్చారని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నోటికొచ్చినట్టు వాగుతూ ప్రజల హృదయాలు చీకరించే సిద్ధికి జిగదారు పోతున్న మడకశిర నియోజకవర్గ రాజకీయాలు ప్రజలు చింతిస్తున్నారు. ఇలాంటి రాజకీయ ప్రకరణలు కులాల మీద దూషణలు లక్ష కోట్లకు అవినీతిపరులు ఇరు పార్టీల నాయకులని మడకశిరనియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి శూన్యం అని ప్రజలే గ్రహించే సమయం ఆసన్నమైంది, ఈ కార్యక్రమంలో ఐటి విభాగం కోఆర్డినేటర్. ప్రసాద్, మడకశిర మండల అధ్యక్షుడు టి.ఎ శివాజీ, కమిటీ సభ్యులు కుమార్, చంద్ర, బలరాం, ప్రవీణ్ కుమార్, నాగార్జున, రాము, దొడ్డయ్య, కమిటీ సభ్యులు, నియోజకవర్గ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.