వారాహి యాత్రలో మీడియా విభాగం విజయవంతంగా పనిచేస్తుంది

కాకినాడ: జనసేన పార్టీ కేంద్ర మీడియా కో ఆర్డినేటర్ విభాగంలో అజయ్ వర్మ, బొలియశెట్టి శ్రీకాంత్, ఆళ్ల హరి, వీళ్లు ముగ్గురే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా మీడియా సహాయ విభాగం లో గంట స్వరూప, సరోజినీ, శిరీష అందరూ కలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో మీడియా మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా మీడియా వాళ్ళకి సహకారం అందిస్తూ మీడియా టీం విభాగము గట్టిగా పనిచేస్తున్నారు. మీడియా మిత్రులు దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. మాకు చాలా చక్కగా సహకరిస్తున్నారు అని మీడియా మిత్రులు అభినందనలు తెలియజేశారు.