పవన్ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం దుమ్మెద గ్రామంలో – పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జెనసేనపార్టీ నాయకుడు బి.సంతోష్ ఆధ్వర్యంలో శనివారం దుమ్మెద గ్రామములో మెగా రక్తదాన శిబిరం ఎర్పాటు చేశారు. ఈ రక్తదానానికి పవణ్ అభిమానులు భారీగా తరలి వచ్చి రక్తం దానం చేశారు. అన్ని దానాల కన్నా రక్త దానమే మిన్న అంటూ నినాదాలు చేస్తూ మరో పక్క ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ వారు సహకారం అందించారు.ఈ సందర్భంగా పవణ్ వీర అభిమానులు మాట్లాడుతూ ఇటువంటి బృహత్తరమైన గొప్ప శిబిరాన్ని ఆనాడు మెగాస్టార్ స్థాపించడం వలన ఎంతో మంది ప్రాణాలు కపా డుగలుగుతున్నామన్నారు. అదేవిధంగా ఆయన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని ఈ మెగా రక్తదానం శిబిరం ఎర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. సామాజిక బాధ్యతతో పవణ్ అభిమానులఒతా ఈ రక్తదాన శిభిరంలో పాలు పంచుకోవడం ఎంతో అనందంగా వుఒదిన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చెయ్యడం వలన ప్రజలపై జనసేన పార్టీ బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలు వెంట వుంటూ ప్రజలు కష్టాలను తెలుసుకుంటూ ప్రజాసేవకై పరితపిస్తోఒదన్నారు. జనసేన పార్టీకు అధికారం ఇస్తే ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలే కాకుండా మరింత బృహుత్తర కార్యక్రమాలు బాధ్యతతో ప్రజా సేవలో మునిగి తేలుతోందన్నారు. ఈ మెగా రక్త దానశిబిరఒలో మెగా పవణ్ అభిమానులు కేకు కటింగ్ చేసి పవన్ జన్మదినాన్ని టపాసులు కాలుస్తూ ఆనందంగా జరిపారు. ఈ కార్యక్రమములో పార్టీ అభిమానులు మరియు స్థానిక ప్రజలు భారీఎత్తున పాల్గొన్నారు.