జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా ఉచిత మూత్రపిండాల పరీక్షల శిబిరం

ఇచ్చాపురం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తిప్పన దుర్యోధన రెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఆధ్వర్యంలో శాంతి డయాగ్నస్టిక్ సెంటర్ సహాయంతో ఇచ్చాపురం ఈదుపురం పంచాయితీ తిప్పన పుట్టుగలో జనసైనికులు బాసి భారతి రెడ్డి తిప్పన శేఖర్ ఆర్గనైజేషన్ లో జనసేన పార్టీ మెగా ఉచిత మూత్రపిండాల పరీక్షలు శిబిరంలో సుమారు 120 మందికి పైగా టెస్ట్లు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఇచ్చాపురం ఇంచార్జ్ దాసరి రాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర రావు, రాష్ట్ర మత్స్యకార విభాగం నాగుల హరి బెహరా అతిథులు
జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జనసైనికులు వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో సుమారు 40000 మందికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది గమనించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గళమెత్తారు. అయినా ఈ ప్రభుత్వం అతని మాటలు విస్మరించింది. అయినా ప్రభుత్వం చెయ్యవలసిన పని జనసైనికులు చేస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రతి 3 నెలలకు ఒక్కసారి టెస్ట్ లు చేసి ఈ ప్రమాదాన్ని కొంచెమైనా తగ్గించే ఆవకాశం వుంటుంది అన్నారు.