జనసేనాని జన్మదినం సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సందర్బంగా మండల స్థాయి ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో, స్టేట్ డాక్టర్ సెల్ చైర్మన్ మరియు సురక్ష హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు సహకారంతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా డాక్టర్ బొడ్డేపల్లి రఘు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజవంతంగా పూర్తి అయింది. సుమారు 90 మందికి పైగా బాధితులు ఈ యుక్క అవకాశాన్ని వినియోగించుకున్నారు. సుమారు 2 నుంచి 3లక్షలు రూపాయలు విలువ చేసే మందులు బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకు, జనసైనికులకి, కార్యకర్తలకి, నాయుకులకు పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామని తెలిపారు.