ఘనంగా మెగాస్టార్ 67వ జన్మదిన వేడుకలు

  • మెగా ఫ్యాన్స్ అందరం ఏకం కావాలి

గురజాల, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పిడుగురాళ్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
గురజాల నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు ఎర్నన రామకృష్ణ, జనసేన పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గ జనసేన నాయకులు ద్రోణాదుల అంకారావు ముఖ్యఅతిథిగా సాయి వృద్దాశ్రమంలో సీనియర్ మెగాఫ్యాన్స్ సమక్షంలో అట్టహాసంగా జరిగాయి. కేక్ కట్ చేసి వృద్దాలకు పండ్లు వితరణ, అన్నదానం చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రాంభించారు. ముఖ్య అతిధి విచ్చేసిన అంకారావు రక్తదానం చేసారు. సామాజిక సేవ కార్యక్రమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది తెలుగు మదర్ థెరిస్సా మెగాస్టార్ చిరంజీవని రామకృష్ణ అన్నారు. ఆయన స్పూర్తితో దేశ వ్యాప్తంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన గురజాల నియోజకవర్గ జనసేన నాయకులు ద్రోణాదులు అంకారావు మాట్లాడుతూ అభిమానులు అంటే ఈలలు గోలలు చేయడం కాదు సేవా కార్యక్రమాల ద్వారా అభిమానాన్ని చాటుకుంటున్న ఏకైక ఫ్యాన్స్ మెగాఫ్యాన్స్ మాత్రమే అని అన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ వేరుగా లేరని అందరూ ఒకటేనని అందరం కలిసి కట్టుగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా కార్యాచరణ ప్రాంభించాలని అన్నారు. ఆంధ్రా తనూస్ ను సాగానంపేన్దుకు సిద్దం కావాలని కోరారు. జనసేన పార్టీ పిడుగురాళ్ల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ… ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కష్టాల్లో ఉన్న వారికి తన ఇంటి తలుపులు తెరిచే ఉన్టాయని తెలుగు సినీ చరిత్రలో స్వశక్తితో ఎదిగి ఎంతో మందికి రోల్ మోడెల్ గా ఉన్నారని, ఆయన స్ఫూర్తితో ఎంతో మంది హీరోలుగా వెండితెరపై వెలుగొందుతున్నారని అన్నారు. మెగా అభిమానులందరు జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని రమేష్ కోరారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఖాసీం మాట్లాడుతూ మెగా అభిమానులు అందరూ ఒక్కటిగా ఉండాలని జనసేనకు అండగా ఉండాలని కోరారు. అనంతరం సీనియర్ అభిమానులు ఎస్.కె ఆదామ్, గోపి నాయక్, ఎస్.కె బాజి, నన్నేసాలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాపు నాయకులు బస్వాల ఆజాద్ కామిశెట్టి రంగా, మెకానిక్ యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు, కొండా మెస్ట్రీ, గద్దెబోయిన సతీష్, మట్టం పరమేష్, ఆవుల రమేష్, పసుపులేటి నరసింహారావు, అంబటి సాయి, ఆదిత్య, కాకర్ల సీతారామయ్య, మొగిలి కృష్ణ హార్డ్ కోర్ మెగా అభిమానులు జనసైనికులు పాల్గొన్నారు.