జ్యోతుల శ్రీనివాసును కలిసిన తురకలకొండ బాధిత రైతు కమిటీ సభ్యులు

  • తురకలకొండపై మైనింగ్ మాఫియాసభ్యుల దందా
  • ప్రభుత్వపెద్దల సహకారంతో అక్రమంగా రెవిన్యూశాఖ నుండి ఎన్.ఓ.సీ
  • ప్రభుత్వ అనుమతులు లేకుండా తురకలకొండకు జరుగుతున్న రహదారిని నిర్మాణం

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలుమండలం, కొడవలి గ్రామంలో గల తురకలకొండ సర్వే నెంబర్ 133/1 నందు గల కొండపోడు బాధిత రైతు కమిటీ సభ్యులు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసును కలిసి కొడవలి గ్రామంలో గల తురకల కొండపైన సుమారు‌ 370 ఏకరాల భూమిలో దళితకులస్తులు, వెనుకబడిన తరగతులకు చెందిన రైతులు జీడిమామిడి తోటలు పండించుకొనుచూ ఉపాధి పొందుతున్నారు. అటువంటి కొండపైన మైనింగ్ పేరుతో మైనింగ్ మాఫియా తురకల కొండను ఆక్రమించుకునే ఉద్దేశంతో ఉన్నారని, వారికి ప్రభుత్వపెద్దల సహకారంతో రెవిన్యూశాఖ వారు తగు అక్రమంగా ఎన్.ఓ.సీ లు ఇచ్చియున్నారని, మైనింగ్ శాఖ వారు అనుమతులు లభించాయని కొంతమంది మైనింగ్ మాఫియాసభ్యులు చెప్పుకొంటు దందాను చేస్తున్నారని, అక్రమంగా ప్రభుత్వ అనుమతులు గాని ఇతర అనుమతులు గాని లేకుండా ప్రభుత్వం స్థలమైన తురకలకొండ వద్దకు రహదారిని నిర్మిస్తున్నారని, తురకల కొండపైన అక్రమ మైనింగ్ నిమిత్తం రైతులు 2 దావాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నందు వేయడం జరిగిందని సదరు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వపెద్దలు, రెవిన్యూ అధికారుల సహకారంతో మైనింగ్ మాఫియా వారు అక్రమంగా రోడ్డు నిర్మించి, ఏ విధమైన అనుమతులు లేకుండా ఆక్రమంగా మైనింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారని కొడవలి కొండపై మైనింగ్ జరిగితే సుమారు 300 రైతుల కుటుంబాలు నిరాశ్రయులవుతారని, దీని కారణంగా రైతులు ఆర్దికంగా తీవ్రనష్టం చవిచూడవలసి వస్తుందని రైతులు జ్యోతుల శ్రీనివాసు వద్ద వాపోయారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు బాధితరైతులతో మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా జనసేన పార్టీ తరపున తగిన సహయసకారాలు అందిస్తానని కొడవలి తురకలకొండ రైతు బాధితులకు హామీ ఇచ్చారు. అవసరమైతే నేను బాధితరైతులకు మద్దతుగా రైతులతో కలిసి ఉద్యమించడం జరుగుతుందని‌ బాధిత రైతుకమిటి వారికి తగు భరోసాను ఇచ్చారు. ఈ విషయం మొదటి విడత వారాహియాత్ర అనంతరం జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి కొడవలి రైతుల సమస్యను ఆయనకు తెలియజేస్తానని అదేవిధంగా జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ గారికి, పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి, మరో పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారికి, మరో పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్ పీఏసీ తెలియజేయడం జరుగుతుందని జ్యోతుల శ్రీనివాసు అన్నారు. ఈ కార్యక్రమంలో కొడవలి గ్రామానికి చెందిన బాధితరైతు కమిటీ సభ్యులు నక్క శ్రీను (బద్రి), గంపల రాంబాబు, నరాల సుబ్రహ్మణ్య, అమజాలపు నానాజీ, నారాయణమూర్తి ,
శ్రీనుబాబు, శివ, త్రిమూర్తులు, వంశీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.