మంత్రి బొత్సాకు చట్టాలపై అవగాహన లేదు: కోన తాతారావు

రుషికొండపై మంత్రి బొత్స అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆదివారం విశాఖలో ద్వారకనగర్ పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలు మేరకే రుషికొండపై ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని శనివారం మీడియా సమావేశంలో బొత్స అన్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం భవనాలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ చూస్తానంటే వెళ్ళనీయకుండా ఎందుకు ఆంక్షలు విధించారు. భయమెందుకు?. మంత్రి బొత్స.. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంగనపై చర్చకు రావాలి.నిర్మాణాలకు మీరు అనుమతి తీసున్నది 9.88 ఎకరాల్లో.. మరొక 3.86ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయాని హైకోర్టులో ప్రభుత్వం ఆఫిడివిట్ ద్వారా ఒప్పుకున్నారా లేదా?. నిర్మాణాలకి అడ్డంకిగా వున్న 139 చెట్లు మాత్రమే కట్ చేయటానికి అనుమతి పొంది వేల సంఖ్యలో నరికిన మాట వాస్తవం కాదా?. పర్యావరణ (ఎం ఓ ఈ ఎఫ్), సీ ఆర్ జెడ్ నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన విషయం పై చర్చకు జనసేన సిద్దంగా ఉంది.మంత్రి వస్తారా?. వచ్చే ఉగాది తర్వాత పవన్ ప్రజల్లోను బొత్స జైల్లోను పవన్ కళ్యాణ్ సైలెంట్ అవుతారాని బొత్స వ్యాఖ్యల్ని కండిస్తున్నాం ఏ అధికారం లేకుండా ప్రజల్లో తిరుగుతున్న పవన్ కు ప్రజాదరణ లభించుటాన్ని చూసి ఓర్వలేక పిచ్చి కూతలు. కారుచౌకగా బొత్స కుటుంబ సభ్యులు భూములు కొట్టేసారు. బొబ్బిలి పారిశ్రామిక వాడలో బొత్స సోదరులు ఆగ్రో బేస్డ్ ఇధనాల్ ప్యాక్టరీ కి..ఏపీఐఐసీ రేటు ఎకరా భూమి 80 నుంచి 90లక్షలుంటే, మార్కెట్లో ఎకరం కోటి ఇరవై లక్షలుంటే కేవలం ఎకరం 10లక్షలు చొప్పున కాబినెట్ నిర్ణయం ద్వారా 30ఎకరాలు కేటాయించటం అధికార దుర్వినియోగంగా భావిస్తున్నాం. ఇది ఓపెన్ ఆక్షన్ లేదా టెండర్ల ద్వారా కేటా ఇంచాలి. ఎంతో మంది యువ పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తుంటే వారికి ఇవ్వరు. మంత్రి గుడివాడ పవన్పై కారుకూతలు ఆపాలి. శ్రీ పవన్ కళ్యాణ్ విసన్నపేట వెళ్లి కొండని తవ్వి ఎలకని కూడా పట్టుకోలేపాయారని అమర్ అనటం వాస్తవమే.. కానీ ఎలకని పట్టుకోలేదు కానీ 89 ఎకరాలు కొండలు, గుట్టలు, వాగులు ఆక్రమించిన పందికొక్కును పట్టుకున్నారు.
నీ బినామీలు, నీ భూ ఆక్రమణలు, విసన్నపేటలో 609 ఎకరాల్లో చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను కూకటి వేళ్ళతో పెకిలిస్తామని తాతారావు పేర్కొన్నారు.