మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణ చెప్పాలి: జనసేన డిమాండ్

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు డిమాండ్ చేశారు.

మంత్రి వేణుగోపాల కృష్ణ మంగళవారం బాధ్యతలు తీసుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలకోసం సీఎం జగన్ నీ ఆరాధించాలే కానీ ఆరా తీయకూడదు అంటూ వ్యాఖ్యానించటం ఆయన అవివేకానికి నిదర్శమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండి, ప్రజల సమస్యలు, ప్రభుత్వం విధానాలు సమాజానికి చేరావేస్తూ.. ఎండ అనక.. వాన అనక.. పెన్ను కాగితం పట్టుకొని పనిచేస్తూ.. సమాజంలో నాలుగో స్తంభంగా ఉంటూ, సరి అయినా జీతాలు లేకపోయినా ప్రధాన పాత్ర పోసిస్తున్న మీడియా పై ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. మీరు దేవుళ్ళు కాదు కదా మిమ్మలిని ఆరాధించటానికి. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడం సమంజసం కాదు. మంత్రి వ్యాఖ్యల పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని.. మంత్రి పదవి ఉందికదా అనీ ఇష్టం వచ్చినట్టు మాటలాడటం దర్మం కాదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి జర్నలిస్టుల సమస్యలను పరిశీలించి, పరిష్కార చర్యలు తీసుకోకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి జర్నస్టులకు ఇచ్చిన ఇళ్ళ స్థలాల హామీ నేటికీ అమలు కాలేదని, అక్రిడేషన్ల జారీలో సమాచార శాఖ అనుసరించిన నూతన విధానంతో వేలాది మంది జర్నలిస్టులు కనీస గుర్తింపు కార్డుకు నోచుకోదని. ఇంకా అనేక సమస్యలు అపరిష్కతం గానే ఉన్నాయని. వాటి పై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ తరుపున వేణుగోపాల్ రావు డిమాండ్ చేశారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి వ్యాఖ్యానించడం జనసేన పార్టీ తరుపున ఖండించారు.

తక్షణమే మంత్రి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి, వారి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని రాయపూడి వేణుగోపాల్ రావు డిమాండ్ చేశారు.