వాలంటీర్ వ్యవస్థతో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి చేయిస్తున్న అక్రమాలు అనంతం

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం 37వ రోజు 11వ డివిజన్ అంబవరపు వీధిలో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమై డివిజన్ సమస్యలు తెలుసుకొని వాటిపై ఈవిధంగా స్పందించారు. వాలంటరీ వ్యవస్థను అడ్డంపెట్టుకొని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేయిస్తున్న అక్రమాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతం ఉన్నాయని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రజా స్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని వాలంటరీలు నియోజక వర్గంలోని ప్రతిపక్ష,న్యూట్రల్ ఓటర్లను టార్గెట్ గా చేసుకొని అక్రమాలకు పాల్పడుతూ వారిని ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ వాలంటీర్లు అధికార పార్టీ నేతలకు తొత్తులులాగా వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని వీరి ఆగడాలు అరికట్టాలంటే అనంతపురం అర్బన్ నియోజక వర్గంలో వైకాపాని మట్టి కరిపించి జనసేన టీడీపీలకు పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శులు రోళ్ళ భాస్కర్, పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు శాంతమ్మ, లలితమ్మ, కృష్ణవేణి, రమణమ్మ, రాణి, తిలోతమ్మ, నాయకులు వినోద్, ధనుష్, సల్మాన్, కేశవ, కిరణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.