ఫూలే దంపతుల ఆశయాలు జనసేనతోనే సాధ్యం

పామర్రు, సామాజిక రుగ్మతుల పైన పోరాటం, బాలికల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత ఫూలే దంపతులది అని, పాఠశాలల్లో బాలికల ప్రగతి మరియు చట్టసభల్లో మహిళల శాతం పెరుగుదల వారి హక్కుల పరిరక్షణ జనసేనతోనే సాధ్యమని, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు, పచ్చిగళ్ళ సుధీర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ బిసి నాయకులు కఠారి వీరాంజనేయులు, అనగాని అశోక్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొని చిన్నారులకు బహుమతులు అందజేశారు.