ఎమ్మెల్యే శిల్పా రవి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై జనసేన నేత సుధాకర్ ఫైర్

నంద్యాల: ఎమ్మెల్యే శిల్పా రవి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిల పై నంద్యాల జనసేన నాయకులు సుధాకర్ మండిపడ్డారు. సుధాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాన్ని విమర్శించే స్థాయి, అర్హత శిల్పారవికి లేదని, 2014 ఎన్నికల సమయంలో శిల్ప కుటుంభం టిడిపి పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సభ నిర్వహించడానికి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్లారో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచిఒచారు. శిల్ప కుటుంభం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులకు భజన చేస్తు, రాజకీయాలలో జంపింగ్ జపాంగ్ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది శిల్ప కుటుంబమేనని, శిల్పా రవి పవన్ కళ్యాణ్ విమర్శించడం మానుకొని నంద్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బైరెడ్డి రాయలసీమలో పవన్ని తిరగనియ్యను అనడం సరైంది కాదని, బైరెడ్డి సొంత కుటుంబంలో ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారో ముందు తెలుసుకోనీ మాట్లాడాలని పవన్ కళ్యాణ్ నోటి నుంచి బైరెడ్డి అనే పేరు వచ్చినందుకు బైరెడ్డి ఆనందపడి పండగ చేసుకోవాలే కానీ పవన్ కళ్యాణ్ ని విమర్శించడం సరైన పద్ధతి కాదని తెలియజేశారు.