టీఆర్‌ఎస్‌ ప్యాకేజీ తీసుకున్న ఆంధ్రుల ద్రోహి జగన్‌: గురాన అయ్యలు

విజయనగరం: గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తులను తెలంగాణాకు దారాదత్తం చేసిన ఆంధ్రుల ద్రోహి జగన్మోహన్‌రెడ్డి అని జనసేన నాయకుడు గురాన అయ్యలు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ దత్త పుత్రుడు సీఎం జగన్‌ అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి, పాలన గురించి మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌ కేసీఆర్‌ చేతిలో కీలుబొమ్మ అన్నారు. అత్యున్నత భావాలు కలిగి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం గురించి అలోచించే తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ గురించి వైకాపా నాయకులు విమర్శలు చేయడం విచారకరమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వా సలహాదారో? వైసీపీ పార్టీ సలహాదారో? అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పగలరా అని నిలదీశారు. జనసేన పొత్తుల గురించి వైసీపీ నాయకులకు అనవసరమన్నారు. పొత్తు ఉంటుందో లేదో తెలియకుండానే ఎందుకు వైకాపా నాయకులు వణికిపోతున్నారో అర్ధం కావడం లేదన్నారు. పొత్తున్నా.. లేకపోయినా.. వైకాపా పార్టీని అధికారం నుంచి దించడం ఖాయమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుల కారణంగా రాష్ట్రం ఇలా తగలబడిరదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ నాయకుల కాళ్లు ఒత్తుతూ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్మోహన్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేసి, రాజకీయబి లబ్ధికోసం ఆ పార్టీలో చేరి పదవులు అనుభవిస్తున్న నేతలు నైతికత గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం కావాలని సంతకాలు చేయించుకున్న జగన్మోహన్‌రెడ్డికి, పేద ప్రజల కోసం తన కష్టార్జితాన్ని దారపోస్తున్న తమ నాయకుడు పవన్‌ కల్యాణ్‌కు అసలు పోలికే లేదన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దొంగలుగా, దోపిడీ దారులుగా అభివర్ణించిన టీఆర్‌ఎస్‌ పార్టీకి లబ్ధిచేకూర్చడానికి తెలంగాణాలో షర్మిలాతో పార్టీ పెట్టించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో ఎన్నికల ఫండ్‌ రూపంలో వేల కోట్లు తీసుకున్న జగన్మోహన్‌రెడ్డి తొత్తులు ప్యాకేజీల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారాహి వాహనంతో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి తమ నాయకుడు సిద్ధమైతే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు జగన్మోహన్‌రెడ్డి మెప్పు పొందడం కోసం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ జనసేనాని నిస్వార్ధంగా ప్రజా సేవ చేయడానికి అడుగులు వేస్తున్నారని, ఆయనకు వస్తున్న స్పందన చూసి వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా అంటూ పదే పదే ఎందుకు ప్యాంట్‌లు తడుపుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక పవన్‌ కల్యాణ్‌ను విమర్శించేందుకు వైకాపా ముఖ్య క్యాడర్‌ మొత్తం రంగంలోకి దిగిందంటే పవన్‌ ఎంత పవర్‌ఫుల్‌ నాయకుడో అర్ధం చేసుకోవచ్చునన్నారు. పవన్‌ కల్యాణ్‌పై అనవసరపు వ్యాఖ్యలు చేస్తే తప్పక తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు.