జనసేన కోసం మోగా సైన్యం కార్యక్రమం

నంద్యాలలో జనసేన కన్వీనర్ విశ్వనాథ్, పిడతల సుధాకర్, రామచరణ్ పట్టణ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో జనసేన కోసం మెగా సైన్యం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పద్మావతి నగర్ నుంచి గోల్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీనీ కొనసాగించారు. జనసేన, టిడిపి నాయకులు, చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ భారీగా పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా నటుడు, జనసేన నాయకుడు పృథ్విరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోగా అభిమానుల మద్దతు టిడిపి, జనసేన ఉమ్మడి కూటమి విజయం ఖాయమని తేల్చి చెప్పారు. జనసేనకు సిని ఇండస్ట్రీస్ మద్దతు కూడా ఉందన్నారు. ఖద్దర్ వేసుకున్న ఖద్దర్ మాటలు మాట్లడని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. తిరుమల దర్శనం చేపిస్తుందని రోజాకి మద్దతుగా కొందరు మాట్లడారు అమె చరిత్ర అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. డైమండ్ రాణిపై అనేక అరోపణలు ఉన్నాయి రోజా ఓడిపోవడం ఖాయమని హితవు పలికారు. మా ప్రభుత్వం వచ్చాక సంబరాల రాంబాబు సేవలు సంక్రాంతి పండుగకు వాడుకుంటామని అన్నారు. ఎన్నికలలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థులు 136 ఎమ్మెల్యే, 21 ఎంపి సీట్లు గెలవనున్నారని తెలిపారు. అతిథులుగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి నాయుడు, పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జి చింతా సురేష్, టిడిపి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, నంద్యాల నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ఫరుక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టిడిపి నాయకులు తాతిరెడ్డి తుంచి రెడ్డి, బాబుల్ల, టిడిపి కౌన్సిలర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.