జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తీగల చంద్రశేఖర్

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే హోదా మరచి ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన పార్టీ, ప్రతిపక్ష పార్టీలను నీచమైన భాషతో సంబోధించడం చూస్తుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఓటమి భయం పట్టుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ అన్నారు.

గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన గూడూరు రూరల్ మండల జనసేన పార్టీ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అవిర్భవదినోత్సవం రోజు, అలాగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలతో సీఎం జగన్ లో అసహనం పెరిగిపోయింది.  కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రతిపక్ష పార్టీలను శాపనార్థాలు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.
రైతు పక్షపాత ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం కౌలు రైతుల ఆత్మహత్యలు పట్టించుకోవడం లేదని, ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు  రైతులకు అండగా నిలవాలని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కష్టార్జితంతో సంపాదించిన 5 కోట్ల రూపాయల నిధులను వారి కుటుంబాలకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు జనసేన ‘కౌలు రైతులకు భరోసా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆత్మహత్య చేసుకొని మరణించిన కౌలు రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్  నేరుగా కలిసి ఈ ప్రపంచానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం తెలియజేస్తారన్న భయంతో వైఎస్ మోహన్ రెడ్డి ద్వేషం అసూయ, అభద్రతా భావంతో ఉన్నారన్నారు. దీంతో ఎలాగైనా ప్రజల ఆలోచనలను పక్కకు మళ్ళించాలని..  పీకుడు భాష మొదలుపెట్టి ఆయన ఆసహనాన్ని ప్రదర్శిస్తూ.. ముఖ్యమంత్రి స్థాయికి అగౌరవాన్ని తెస్తున్నారన్నారు.
అడ్డగోలుగా పెంచిన  విద్యుత్ చార్జీలతో పాటుగా, అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయం కావడంతో అవస్థలు పడుతున్నారని, సీఎం సొంత జిల్లా లో ముగ్గురు చిన్నారులు విద్యుత్ కొరత, వైద్య పరికరాలు వాడకపోవడంతో మృతి చెందడం బాధాకరమన్నారు.
వీటికి తోడు ఆస్తిపన్ను పెంపు, చెత్త సేకరణ పై చెత్త పన్నుతో పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు అల్లాడి పోతున్నారని, ఇప్పటి కైనా జనసేన, ఇతర ప్రతిపక్ష పార్టీల పైన తిట్ఠడంలో ఉన్న శ్రద్ధ వైద్య, విద్యుత్ రంగాలతో పాటు, రైతాంగం పై దృష్టి పెట్టాలని వైసీపీ నాయకులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాటకాలను అర్థం చేసుకుంటున్నారని, జగన్మోహన్ రెడ్డి ఆయన సలహా దారులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడిన నిస్వార్థ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం  తథ్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి జనసైనికులు పని చేస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండాలని మండల నాయకులను కోరారు. అనంతరం గూడూరు మండల అధ్యక్షులు పారిచెర్ల భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంకు మండల కమిటీ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు నవీన్ రాజు, జనార్దన్, సుభాష్, పవన్ కళ్యాణ్, నవీన్, శ్రీను, వినోద్, హరిబాబు, మస్థాన్, వెంకటేష్, అనీల్, మోహన్, ఇంద్ర, రాఘవ, రాజు, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు.